Veldanda: విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి: సర్పంచ్ మట్ట యాదమ్మ!
Veldanda: వెల్దండ పోలీస్ స్టేషన్ ఎదుట జాతీయ రహదారిపై నూతన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం. ఎమ్మెల్యే కసిరెడ్డి సహకారంతో సమస్య పరిష్కారం: సర్పంచ్ మట్ట యాదమ్మ.
Veldanda: విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి: సర్పంచ్ మట్ట యాదమ్మ!
వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై గల పోలీస్ స్టేషన్ ముందు ఏర్పాటు చేసిన నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏఈ వెంకటేశ్వర్లు వార్డు సభ్యులు సిరసనగాండ్ల శేఖర్ ఉప సర్పంచ్ ఎర్ర శ్రీను ముదిరాజ్ తో కలిసి గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ శుక్రవారం పూజలు చేసి టెంకాయలు కొట్టి నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను ప్రారంభించినారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో మంజూరు చేయించమని, ఈ నూతన ట్రాన్స్‌ఫార్మర్ వల్ల విద్యుత్ సమస్యలు పూర్తిగా తొలగిపోయి, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు క్యాసరాపు వెంకటయ్య, బయ్య మల్లయ్య, బాలరాజ్, ఎస్, శేఖర్ , ముదిగొండ రమేష్,పి దేవేందర్, యాదయ్య, సంతోష్ కుమార్, లైన్ మెన్ లక్ష్మణ్ , శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.




