Vanasthalipuram: తప్పిపోయిన నాలుగేళ్ల బాలుడు క్షేమంగా గుర్తింపు!

Vanasthalipuram: వనస్థలిపురం గణేష్ ఆలయం వద్ద తప్పిపోయిన నాలుగేళ్ల బాలుడు జయంష్ రెడ్డిని గంటలోపే గుర్తించి తల్లికి అప్పగించిన పోలీసుల స్పందనపై ప్రశంసలు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 18 Oct 2026 1:43 PM IST
Vanasthalipuram
X

Vanasthalipuram: తప్పిపోయిన నాలుగేళ్ల బాలుడు క్షేమంగా గుర్తింపు!

Vanasthalipuram: వనస్థలిపురంలోని గణేష్ టెంపుల్ వద్ద తప్పిపోయిన నాలుగేళ్ల బాలుడిని పోలీసులు గంటలోపే గుర్తించి, సురక్షితంగా తల్లికి అప్పగించారు.

వనస్థలిపురంలోని గణేష్ టెంపుల్ వద్ద తన నాలుగేళ్ల కుమారుడు జయంష్ రెడ్డి కనిపించడం లేదని తల్లి లావణ్య వనస్థలిపురం పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే స్పందించిన పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. పోలీస్ సిబ్బంది వెంకటేష్, సుధాకర్‌తో పాటు మహిళా సిబ్బంది ప్రేమలత బాలుడి కోసం వెతికారు. ఈ క్రమంలో గంటలోపే బాలుడిని గుర్తించి, సురక్షితంగా తల్లి లావణ్యకు అప్పగించారు.

సమాచారం అందిన వెంటనే స్పందించి బాలుడిని క్షేమంగా తల్లి చెంతకు చేర్చిన వనస్థలిపురం పోలీసులను పలువురు అభినందిస్తున్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR