Vanasthalipuram: శ్రీనివాసపురంలో నూతన పార్కు ప్రారంభం ఈటల, సుధీర్‌రెడ్డి

Vanasthalipuram: వనస్థలిపురం డివిజన్ శ్రీ శ్రీనివాసపురం కాలనీలో నూతన పార్కును ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ప్రారంభించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 28 Nov 2026 5:09 PM IST
Vanasthalipuram
X

Vanasthalipuram: శ్రీనివాసపురంలో నూతన పార్కు ప్రారంభం ఈటల, సుధీర్‌రెడ్డి

వనస్థలిపురం: వనస్థలిపురం డివిజన్‌ పరిధిలోని శ్రీ శ్రీనివాసపురం కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్కును మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌, ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రారంభించారు. కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు దూసరి మధు గౌడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

కాలనీలో పార్కు అందుబాటులోకి రావడంతో స్థానికులకు ఆహ్లాదకరమైన వాతావరణం, వాకింగ్‌, విశ్రాంతికి సౌకర్యం కలగనుంది. ఈ సందర్భంగా కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు అతిథులకు స్వాగతం పలికారు.

కార్యక్రమంలో వనస్థలిపురం డివిజన్‌ బీఆర్ఎస్‌ అధ్యక్షుడు చింతల రవికుమార్‌, శ్రీనివాస్‌రెడ్డి, కుంట్లూరు వెంకటేష్‌గౌడ్‌, గౌరవ అధ్యక్షుడు రాజేష్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శి వేణు, కోశాధికారి యాదగిరి, ఉపాధ్యక్షులు యాదయ్య, సుమన్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శులు శ్రీధర్‌రెడ్డి, సాయికుమార్‌, కార్యవర్గ కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి, ఈసీ సభ్యులు బాల్‌రెడ్డి, రతన్‌రాజ్‌, ఆంజనేయులు, ఆతుల్‌ షిండే తదితరులు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR