Hyderabad: ఉప్పుగూడలో డీజేలకు భిన్నంగా మహా గణపతి శోభాయాత్ర!

Hyderabad: హైదరాబాద్ పాతబస్తీ ఉప్పుగూడలో డీజే శబ్దాలు లేకుండా భక్తి గీతాలు, సంప్రదాయ కళారూపాలతో మహా గణపతి శోభాయాత్ర సాగింది.

MOHD MOHIUDDIN, YAKUTHAPURA
Published on: 25 Sept 2026 5:52 PM IST
Hyderabad
X

Hyderabad: ఉప్పుగూడలో డీజేలకు భిన్నంగా మహా గణపతి శోభాయాత్ర!

హైదరాబాద్‌: పాతబస్తీ ఉప్పుగూడలో మహా గణపతి శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. సాధారణంగా గణేష్ నిమజ్జనం అంటే డీజే సౌండ్స్‌, పాటలు, డ్యాన్సులతో సందడి కనిపిస్తుంది. అయితే అందుకు భిన్నంగా.. భజనలు, భక్తి గీతాలు, సంప్రదాయ కళారూపాలతో ఉప్పుగూడలో శోభాయాత్ర కొనసాగుతోంది.

సైదాబాద్‌ ప్రధాన రహదారిపై శ్రీ రామ భక్త సమాజం శ్రీ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా గణపతిని ఊరేగిస్తున్నారు. ఈ శోభాయాత్రలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొని గణనాథుడిని దర్శించుకున్నారు. శ్రీ రామ భక్త సమాజం సభ్యుల భజనలు, యువత ఆటపాటలు, కోలాటాలు, డప్పు వాయిద్యాలతో కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగుతోంది.

పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. “గణేష్ మహారాజ్‌కి జై” అంటూ భక్తుల నినాదాలతో సైదాబాద్‌ ప్రధాన రహదారి మార్మోగుతోంది. ఆధునిక హంగామాకు దూరంగా.. భక్తి, సంప్రదాయం, సంస్కృతిని చాటుతూ సాగుతున్న ఈ మహా గణపతి శోభాయాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

MOHD MOHIUDDIN, YAKUTHAPURA

MOHD MOHIUDDIN, YAKUTHAPURA