Nagarkurnool: ఎల్లికల్‌లో మృతుడి కుటుంబానికి ఉప్పల వెంకటేష్ ఆర్థిక సాయం!

Nagarkurnool: కల్వకుర్తి మండలం ఎల్లికల్‌లో అనారోగ్యంతో మరణించిన పరుశరాములు కుటుంబానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఆర్థిక సాయం అందజేత.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 21 Sept 2026 11:45 AM IST
Nagarkurnool
X

Nagarkurnool: ఎల్లికల్‌లో మృతుడి కుటుంబానికి ఉప్పల వెంకటేష్ ఆర్థిక సాయం!

Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ఎల్లికల్ గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సహకారంతో మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం.

ఈరోజు ఎల్లికల్ గ్రామంలో కాశమోని పరుశరాములు అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయాన్ని బిఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు & మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మద్దెల వెంకటయ్య, శెట్టిపల్లి లోకేష్,ఆరకంటి పరమేశ్,పాలది పర్వతాలు,ఉప్పల టీమ్ సబ్యులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆడేల అశోక్, అనిల్ దాదమోని ,కోట్ల వెంకటయ్య, సురేందర్ చారి,సురేష్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY