Talakondapally: మృతురాలి కుటుంబానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక చేయూత!

Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గట్టుఇప్పలపల్లిలో మృతి చెందిన ఎల్లమ్మ కుటుంబానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 8 Oct 2026 1:26 PM IST
Talakondapally
X

Talakondapally: మృతురాలి కుటుంబానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక చేయూత!

Talakondapally: ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ తన సేవలను కొనసాగిస్తోంది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గట్టుఇప్పలపల్లి గ్రామానికి చెందిన మిన్నల ఎల్లమ్మ గురువారం రాత్రి మృతి చెందారు.

విషయం తెలుసుకున్న ఉప్పల వెంకటేష్ ముఖ్య అనుచరుడు మోకురాల అశోక్‌గౌడ్ ద్వారా సమాచారం అందడంతో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్, తలకొండపల్లి మాజీ జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ స్పందించారు.

మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ రూ.3 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు తనవంతు సహకారం అందించడం అభినందనీయమని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మోకురాల ఆంజనేయులు గౌడ్, ఎదుల శరత్‌చంద్ర, ఎదుల అనిల్, బొంబాయి రాజు, రవి రాజు, బొర్ర వసంత్‌కుమార్, మిన్నల గోపాల్‌తో పాటు గ్రామ పెద్దలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY