Uppal: ఉప్పల్‌లో ఇద్దరు విద్యార్థుల అరెస్ట్ రూ. 2.40 లక్షల డ్రగ్స్ స్వాధీనం

Uppal: ఉప్పల్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు విద్యార్థుల అరెస్ట్. 9.6 గ్రాముల ఓజీ కుష్, 14 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం. రిమాండ్‌కు తరలింపు.

KARUNAKAR, UPPAL
Published on: 22 Sept 2026 9:22 PM IST
Uppal
X

Uppal: ఉప్పల్‌లో ఇద్దరు విద్యార్థుల అరెస్ట్ రూ. 2.40 లక్షల డ్రగ్స్ స్వాధీనం

ఉప్పల్‌: పంజాబ్‌లో చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థులు హైదరాబాద్‌ ఉప్పల్ లో డ్రగ్స్‌ విక్రయిస్తూ ఎక్సైజ్‌ స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎస్‌టీఎఫ్‌) సీ టీమ్‌కు పట్టుబడ్డారు. ఉప్పల్‌ సరస్వతీ కాలనీలోని ఓ గదిలో డ్రగ్స్‌ విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో అధికారులు దాడి చేశారు.

అనంతపూర్‌కు చెందిన దేవరకొండ విద్యశ్రీ, హైదరాబాద్‌కు చెందిన కోడూరు విష్ణువర్ధన్‌రెడ్డి పంజాబ్‌లోని ఓ జాతీయ కళాశాలలో చదువుకుంటున్నారు. ఇద్దరికీ డ్రగ్స్‌ అలవాటు కావడంతో డబ్బుల కోసం పంజాబ్‌ నుంచి మాదకద్రవ్యాలను హైదరాబాద్‌కు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు ఎస్‌టీఎఫ్‌ అధికారులు తెలిపారు.

వారి నుంచి 9.6 గ్రాముల ఓజీ కుష్‌, 14 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2.40 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఇద్దరినీ అరెస్టు చేసి డ్రగ్స్‌తో సహా ఉప్పల్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌లో అప్పగించినట్లు ఎస్‌టీఎఫ్‌ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఉప్పల్‌ ఎక్సైజ్‌ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్‌ విధించింది..

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL