Uppal: ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ

Uppal: మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో సద్దుల బతుకమ్మ వేడుకలను సీఐ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో మహిళా సిబ్బంది ఘనంగా నిర్వహించారు.

KARUNAKAR, UPPAL
Published on: 18 Oct 2026 7:53 PM IST
Uppal
X

Uppal: ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ

ఉప్పల్‌: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మల్కాజిగిరి పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌లో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఉప్పల్‌ సీఐ రామలింగారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో మహిళా పోలీసు సిబ్బంది బతుకమ్మలను పేర్చి, పండుగ సందడిని నింపారు. ఈ సందర్భంగా సీఐ రామలింగారెడ్డి, మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో బతుకమ్మకు ప్రత్యేక స్థానం ఉందన్నారు.

తంగేడు, గునుగు, బంతి, చామంతి, గుమ్మడి తదితర రంగురంగుల పూలతో బతుకమ్మను అందంగా అలంకరిస్తారని తెలిపారు. పసుపుతో గౌరమ్మను రూపొందించి తొమ్మిది రోజులపాటు ఆటపాటలతో బతుకమ్మ వేడుకలను జరుపుకుంటారని వివరించారు. చివరి రోజైన సద్దుల బతుకమ్మ సందర్భంగా బతుకమ్మలను నిమజ్జనం చేయడంతో ఉత్సవాలు ముగుస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ట్రాపిక్ ఇన్స్పెక్టర్ నాగరాజు, ఆర్‌ఐ గోవర్ధన్‌, ఎస్‌ఐ సమత, ఏఎస్‌ఐలు రాజకుమారి, మైమున్నిసా, కానిస్టేబుళ్లు సంగీత, శిరీష, జ్యోతి, యాదమ్మ, సంతోషి, అనిజ, చైతన్య, వరలక్ష్మి, అమరావతి, నిషా, శ్రీకళ తదితరులు పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL