Kapra: పారిశుద్ధ్య కార్మికులకు దసరా కానుకలు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
Kapra: కాప్రాలో రేగళ్ల సతీష్ రెడ్డి పుట్టినరోజున జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి దసరా కానుకలుగా దుస్తుల పంపిణీ చేశారు.
Kapra: పారిశుద్ధ్య కార్మికులకు దసరా కానుకలు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
కాప్రా: కాప్రా డివిజన్ కి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు రేగళ్ల సతీష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికులకు దసరా కానుకగా చీరలు బట్టల పంపిణీ. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పారిశుద్ధ్య కార్మికులకు దసరా కానుకలను పంపిణీ చేసి కేక్ కట్ చేసి సతీష్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి రేగళ్ల సతీష్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి, ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవిస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. అనంతరం మొక్కలు నాటి రక్తదాన శిబిరం ప్రారంభించారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని
సమాజ ఆరోగ్యం, పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమించే పారిశుద్ధ్య కార్మికులను గౌరవిస్తూ, వారి పట్ల ఆప్యాయతను చాటుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, గొల్లూరి అంజయ్య, బొంతు శ్రీదేవి యాదవ్, సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి, పావని మణిపాల్ రెడ్డి, ప్రభుదాస్, పన్నాల దేవేందర్ రెడ్డి, పలువురు స్థానిక బిఆర్ఎస్ కాంగ్రెస్, బిజెపి, తెలుగుదేశం పార్టీల నాయకులు, కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.




