Nacharam: రోడ్డు ప్రమాదంలో గాయపడిన శానిటేషన్ వర్కర్‌కు ఎమ్మెల్యే పరామర్శ!

Nacharam: విధుల్లో రోడ్డు శుభ్రం చేస్తుండగా వాహనం ఢీకొని గాయపడిన శానిటేషన్ వర్కర్ నరసింహను ఈఎస్‌ఐ ఆసుపత్రిలో పరామర్శించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి.

HARISH, TARNAKA
Published on: 6 Oct 2026 5:09 PM IST
Nacharam
X

Nacharam: రోడ్డు ప్రమాదంలో గాయపడిన శానిటేషన్ వర్కర్‌కు ఎమ్మెల్యే పరామర్శ!

Nacharam: విధుల్లో భాగంగా రోడ్డు శుభ్రం చేస్తుండగా వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన శానిటేషన్ వర్కర్‌ నాగారం నరసింహను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పరామర్శించారు.

నాచారం డివిజన్‌లో శానిటేషన్ వర్కర్‌గా పనిచేస్తున్న నరసింహ ఈ నెల 2న ఉదయం హబ్సిగూడ వద్ద రోడ్డు శుభ్రం చేస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన రెండు కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రికి తరలించారు.

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆసుపత్రికి వెళ్లి నరసింహను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్య సేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నరసింహ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈఎస్‌ఐ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జయను కలిసి నరసింహకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే కోరారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్, గంధం నాగేశ్వరరావు, నాగారం బాబు, ఎస్‌ఎఫ్‌ఏ ఏకస్వామి తదితరులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA