Kapra: మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సమీక్షా సమావేశం
Kapra: కాప్రా సర్కిల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సమీక్ష నిర్వహించి, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
Kapra: మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సమీక్షా సమావేశం
కాప్రా: కాప్రా సర్కిల్ మున్సిపల్ కార్యాలయంలో ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉప్పల్, నాచారం, కాప్రా డీసీ లు ఆనంద్, నిత్యానంద్,రవీందర్ సాగర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న ప్రజా సమస్యలు, పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, టౌన్ ప్లానింగ్, దోమల నివారణ, ఫుడ్ సేఫ్టీ తదితర అంశాలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు.
ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల తీవ్రతను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.
మంజూరైన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, పెండింగ్లో ఉన్న పనులకు సంబంధించి స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో సంబంధిత బస్తీల పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు తమ ప్రాంతాల్లోని సమస్యలను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్యలను స్వయంగా విన్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం, ప్రతి బస్తీని అభివృద్ధి పథంలో నడిపించడం తన ప్రాధాన్యత అని, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావులేదని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.
ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని పిలుపునిచ్చారు.




