Kushaiguda: పద్మావతి కాలనీ ఆర్చ్ నిర్మాణానికి ఎమ్మెల్యే BLR భూమిపూజ
Kushaiguda: కుషాయిగూడ డివిజన్ పద్మావతి కాలనీలో నూతనంగా నిర్మించనున్న స్వాగత ఆర్చ్ పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఘనంగా భూమిపూజ చేశారు.
Kushaiguda: పద్మావతి కాలనీ ఆర్చ్ నిర్మాణానికి ఎమ్మెల్యే BLR భూమిపూజ
Kushaiguda: కుషాయిగూడ డివిజన్ పరిధిలోని పద్మావతి కాలనీలో నూతనంగా నిర్మించనున్న ఆర్చ్ నిర్మాణ పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాలనీల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. కాలనీలకు ప్రత్యేక గుర్తింపునిచ్చే విధంగా ఆర్చ్ నిర్మాణం చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ధనపాల్ రెడ్డి,పద్మావతి కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, స్థానిక నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.




