AS Rao Nagar: ఏఎస్ రావు నగర్‌లో రూ.1.83 కోట్ల పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
AS Rao Nagar: డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్‌లో రూ.1.83 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 7 నూతన సీసీ రోడ్డు, స్టార్మ్ వాటర్ డ్రైనేజీ పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు.
AS Rao Nagar: ఏఎస్ రావు నగర్‌లో రూ.1.83 కోట్ల పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
AS Rao Nagar: డా. ఏఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలో రూ.1.83 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 7 అభివృద్ధి పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు.
ప్రధానంగా పలు ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు స్టార్మ్ వాటర్ డ్రైనేజీ పనులను చేపట్టనున్నారు. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించడంతో పాటు వర్షాకాలంలో డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా ఈ పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
అయ్యప్ప స్వామి దేవాలయం, సౌత్ కమలా నగర్ బైలేన్లు, మహేష్ నగర్–గాయత్రి నగర్ రోడ్డు, నాయక్రాంతి నగర్–నేతాజీ నగర్ జంక్షన్, శ్రీనివాస్ నగర్, కమలా నగర్, శ్రీనగర్ కాలనీ, సుభాష్ చంద్ర నగర్, న్యూ శ్రీనివాస్ నగర్, వీ.ఎన్. రెడ్డి నగర్ తదితర ప్రాంతాల్లో ఈ అభివృద్ధి పనులు జరగనున్నాయి.
అయ్యప్ప స్వామి దేవాలయం, సౌత్ కమలా నగర్ పరిధిలో సీసీ రోడ్లు, బైలేన్ల నిర్మాణం – రూ.30.50 లక్షలు
మహేష్ నగర్ నుంచి గాయత్రి నగర్ రోడ్డు వరకు సీసీ రోడ్డు – రూ.19 లక్షలు, నాయక్రాంతి నగర్ ప్లాట్ నం.58 నుంచి నేతాజీ నగర్ జంక్షన్ వరకు స్టార్మ్ వాటర్ డ్రైన్ – రూ.52 లక్షలు, ఆటోస్టాండ్, శ్రీనివాస్ నగర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వద్ద కమలా నగర్‌లో సీసీ రోడ్లు – రూ.18 లక్షలు
పోచమ్మ దేవాలయం, శ్రీనగర్ కాలనీలో సీసీ రోడ్లు – రూ.16.50 లక్షలు, సుభాష్ చంద్ర నగర్‌లో హెచ్.నెం. 9-124/B నుంచి Rim Design Technologies వరకు సీసీ రోడ్డు – రూ.28 లక్షలు,న్యూ శ్రీనివాస్ నగర్ రోడ్లు 10, 11, 12తో పాటు వీ.ఎన్. రెడ్డి నగర్‌లో కల్వర్ట్ సమీపంలో సీసీ రోడ్లు – రూ.19 లక్షలు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని, డా. ఏఎస్ రావు నగర్‌లో పెండింగ్‌లో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు. చేపట్టిన పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో BRS పార్టీ రాష్ట నాయకులు సోమ శేఖర్ రెడ్డి,మాజీ కార్పొరేటర్లు శిరీష సోమ శేఖర్ రెడ్డి, కొత్త రామారావు మాజీ డివిజన్ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి డివిజన్ BRS పార్టీ నాయకులు కాలనీ వాసులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.




