Ghatkesar: ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌ను అన్నోజిగూడ దాకా పొడిగించాలి!
Ghatkesar: ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌ను అన్నోజిగూడ వరకు పొడిగించాలని, పోలీస్ కమిషనరేట్‌కు అండర్‌పాస్ నిర్మించాలని బీజేపీ నేత ఏనుగు సుదర్శన్‌రెడ్డి ఎన్హెచ్ఏఐకి వినతిపత్రం ఇచ్చారు.
Ghatkesar: ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌ను అన్నోజిగూడ దాకా పొడిగించాలి!
ఘట్ కేసర్: ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌ను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అన్నోజిగూడలోని ఎన్హెచ్ఏఐ టోల్రోడ్డు ప్రవేశం వరకు పొడిగించాలని కోరుతూ బీజేపీ మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి ఏనుగు సుదర్శన్‌రెడ్డి ఎన్హెచ్ఏఐ చీఫ్ ఇంజినీర్, రీజినల్ ఆఫీసర్ (రోడ్స్) ఎ.కృష్ణప్రసాద్‌ను కలిశారు. రాష్ట్ర యువమోర్చా నాయకుడు బండారు పవన్‌రెడ్డితో కలిసి వినతిపత్రం సమర్పించారు.
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌కు ప్రత్యేక అండర్‌పాస్ లేదా అనుసంధాన మార్గాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. సాయి ఐశ్వర్య కాలనీ, పర్వతాపురం, ప్రతాపసింగారం, కాచవానిసింగారం ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభా, వాహనాల రాకపోకలకు అనుగుణంగా రవాణా సదుపాయాలు మెరుగుపరచాలని సుదర్శన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఎలివేటెడ్ కారిడార్‌ను అన్నోజిగూడ వరకు పొడిగిస్తే ట్రాఫిక్ రద్దీ తగ్గడంతోపాటు పరిసర కాలనీలు, గ్రామాల ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. పోలీస్ కమిషనరేట్‌కు వచ్చే అధికారులు, సిబ్బంది, ప్రజలు, అత్యవసర వాహనాల రాకపోకలకు వీలుగా అండర్‌పాస్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతిపాదనలపై సాంకేతిక సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఎన్హెచ్ఏఐ అధికారులను విజ్ఞప్తి చేశారు.




