Osmania University: ఓయూలో గణనాథున్ని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ ఓల్డ్ పీజీ హాస్టల్‌లో ఏబీవీపీ ప్రతిష్టించిన వినాయకుడిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Osmania University: ఓయూలో గణనాథున్ని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీ (ABVP) ఆధ్వర్యంలో ఓల్డ్ పీజీ హాస్టల్ లో ప్రతిష్టించిన గణనాథున్ని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులకు ఆయన కలశాన్ని అందజేశారు.
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో గణనాథుని ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించడం అభినందనీయమని ఆయన కొనియాడారు.
ఉస్మానియా యూనివర్సిటీలో లైటింగ్ షోతో పాటు హాస్టళ్ల అభివృద్ధికి, ఇతర వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఇదివరకే నిధులు కేటాయించామని మంత్రి తెలిపారు.
ఆ పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, యూనివర్సిటీ మరింత అభివృద్ధి చెందడానికి భవిష్యత్తులో మరిన్ని నిధులు కేటాయించే అవకాశం ఉంటుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.




