Hyderabad: నేడు హైదరాబాద్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా!
Hyderabad: ఇవాళ హైదరాబాద్‌కు రానున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా. మెదక్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న వైనం.
Hyderabad: నేడు హైదరాబాద్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా!
Hyderabad: ఇవాళ హైదరాబాద్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. రాత్రి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం రాష్ట్ర బీజేపీ నాయకత్వంతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా మెదక్ జిల్లా తూప్రాన్‌కు వెళ్లనున్నారు.
అక్కడ పాల కేంద్రం ప్రాజెక్ట్‌ని ప్రారంభించనున్నారు. అనంతరం తూప్రాన్ నుంచి కరీంనగర్‌కు చేరుకొని.. ప్రతిమ మెడికల్ కాలేజీ రజతోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత ప్రతిమ డీమ్డ్ యూనివర్సిటీ భవనానికి శంకుస్థాపన చేసి.. విద్యార్థులతో ముఖాముఖి కానున్నారు. సాయంత్రం కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు చేరుకొని.. అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు.




