Hayathnagar: హయత్‌నగర్‌లో భూగర్భ డ్రైనేజీ ట్రంక్ లైన్ పనుల పునఃప్రారంభం!

Hayathnagar: హయత్‌నగర్‌లో నిలిచిపోయిన భూగర్భ డ్రైనేజీ ట్రంక్ లైన్ పనులను పునఃప్రారంభం. అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి.

AJAY, HAYATH NAGAR
Published on: 28 Sept 2026 5:32 PM IST
Hayathnagar
X

Hayathnagar: హయత్‌నగర్‌లో భూగర్భ డ్రైనేజీ ట్రంక్ లైన్ పనుల పునఃప్రారంభం!

Hayathnagar: హయత్‌నగర్ డివిజన్‌లోని జైస్వాల్ ఫర్నిచర్ నుంచి మనుగనూర్ కల్వర్ట్ వరకు చేపట్టిన భూగర్భ డ్రైనేజీ ట్రంక్ లైన్ నిర్మాణ పనులు గతంలో కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలో నిలిచిపోయాయి. ప్రస్తుతం ఈ పనులను తిరిగి పునఃప్రారంభించనున్న నేపథ్యంలో హయత్‌నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి జలమండలి ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు.

ఈ సందర్భంగా డ్రైనేజీ ట్రంక్ లైన్‌కు సంబంధించిన లెవెల్స్, నిర్మాణ పనుల పరిస్థితి, సాంకేతిక అంశాలను అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల పునఃప్రారంభానికి అవసరమైన చర్యలపై అధికారులతో చర్చించారు.

కళ్లెం నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజీ ట్రంక్ లైన్ పనులు పూర్తయితే ఆయా ప్రాంతాల ప్రజలకు డ్రైనేజీ సమస్యల నుంచి గణనీయమైన ఉపశమనం లభిస్తుందని తెలిపారు. గతంలో నిలిచిపోయిన పనులను త్వరితగతిన పునఃప్రారంభించి, ఎలాంటి జాప్యం లేకుండా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి డీజీఎం నాగరాజు తదితర అధికారులు పాల్గొన్నారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR