Nagole: నాగోల్లో ఇద్దరు చిన్నారులు అదృశ్యం.. ఆచూకీ కోసం పోలీసుల గాలింపు!
Nagole: రాచకొండ కమిషనరేట్ నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిరాం నగర్లో 8, 6 ఏళ్ల ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారు; పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.
Nagole: నాగోల్లో ఇద్దరు చిన్నారులు అదృశ్యం.. ఆచూకీ కోసం పోలీసుల గాలింపు!
ఎల్బీనగర్: నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు చిన్నారులు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. సాయిరాం నగర్ కాలనీ, రోడ్ నంబర్ 3కు చెందిన మొగిలి శిరీష (28) తన ఇద్దరు కుమారులు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళితే.. శిరీష కుమారులైన వరుణ్ తేజ్ (8), మహేష్ (6) నాగోల్ ప్రభుత్వ పాఠశాలలో వరుసగా నాలుగు, రెండో తరగతి చదువుతున్నారు. అక్టోబర్ 31న ఉదయం తల్లి పనికి వెళ్లి, రాత్రి 9:30 గంటల సమయంలో ఇంటికి తిరిగి రాగా పిల్లలు కనిపించలేదు.
మొదట పాఠశాలకు వెళ్లి ఉంటారని భావించిన తల్లి అక్కడికి వెళ్లి ఉపాధ్యాయులను విచారించగా.. ఆ రోజు ఇద్దరు చిన్నారులు పాఠశాలకు రాలేదని తెలిసింది. దీంతో ఆందోళనకు గురైన ఆమె వెంటనే నాగోల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఇద్దరు చిన్నారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టి, అదృశ్యానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇద్దరు చిన్నారుల ఆచూకీ తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్కు లేదా నాగోల్ పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నారు.




