Medchal: మల్కారం క్వారీ గుంతలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి!
Medchal: మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పరిధిలోని మల్కారం క్వారీ గుంతలో సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు కాలేజీ విద్యార్థులు రోహిత్, సయాన్ నీటిలో మునిగి మృతి చెందారు.
Medchal: మల్కారం క్వారీ గుంతలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి!
Medchal: సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందిన విషాద సంఘటన జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కారం క్వారీ గుట్టల్లో చోటుచేసుకుంది.
ఆదివారం సెలవు దినం కావడంతో యాప్రాల్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు మల్కారం క్వారీ గుట్టల వద్దకు సరదాగా గడిపేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఈత కొట్టేందుకు క్వారీలోని నీటిలోకి దిగిన ఇద్దరు విద్యార్థులు నీటిలో మునిగిపోయారు.
మృతులు సీవిఆర్ కాలేజీలో చదువుతున్న రోహిత్ (18), సీఎంఆర్ కాలేజీలో చదువుతున్న సయాన్ (18)గా గుర్తించారు.
సమాచారం అందుకున్న జవహర్‌నగర్ పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. హైడ్రా, డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించి నీటిలో గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీసేందుకు సిబ్బంది ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇద్దరు విద్యార్థుల మృతితో కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.




