Uppal: భగాయత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఇద్దరు మృతి!

Uppal: ఉప్పల్ భగాయత్ హెచ్‌ఎండీఏ లేఅవుట్ పరిధిలో అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు.

KARUNAKAR, UPPAL
Published on: 21 Nov 2026 9:27 AM IST
Uppal
X

Uppal: భగాయత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఇద్దరు మృతి!

Uppal: ఉప్పల్‌ భగాయత్‌ హెచ్‌ఎండీఏ లేఅవుట్‌ పరిధిలో అర్ధరాత్రి 12 గంటల సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్‌పై ఉన్న విద్యుత్‌ స్తంభం దిమ్మెను బలంగా ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.

సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న మహ్మద్‌ మునాజిర్‌ (34) తన యమహా ఎఫ్‌జెడ్‌ ద్విచక్రవాహనంపై ఉప్పల్‌ భగాయత్‌ హెచ్‌ఎండీఏ లేఅవుట్‌ నుంచి నాగోల్‌ వైపు బయలుదేరాడు. మార్గమధ్యలో శ్రీపూజ గ్లాస్‌ హార్డ్‌వేర్‌ దుకాణం ఎదురుగా డివైడర్‌పై ఉన్న విద్యుత్‌ స్తంభం దిమ్మెను బైక్‌ బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న మునాజిర్‌తో పాటు వెనుక కూర్చున్న మహ్మద్‌ సలావుద్దీన్‌ (35) అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడు సలావుద్దీన్‌ గుజరాత్‌ రాష్ట్రంలోని భరూచ్‌కు చెందిన కార్మికుడు. ప్రస్తుతం ఉప్పల్‌ భగాయత్‌లోని జైన్‌ భవన్‌లో నివాసముంటున్నాడు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL