Nagole: తొమ్మిది రోజులైనా ఆచూకీ లేదు.. నాగోల్ చిన్నారుల కోసం రూ.20 వేల నజరానా!
Nagole: నాగోల్ సాయిరాం నగర్‌లో అదృశ్యమైన వరుణ్ తేజ్, మహేష్ అనే ఇద్దరు చిన్నారుల ఆచూకీ తెలిపిన వారికి పోలీసులు రూ.20 వేల నగదు బహుమతి ప్రకటించారు.
Nagole: తొమ్మిది రోజులైనా ఆచూకీ లేదు.. నాగోల్ చిన్నారుల కోసం రూ.20 వేల నజరానా!
ఎల్బీనగర్: నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన ఇద్దరు చిన్నారుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. అక్టోబర్ 31వ తేదీ ఉదయం 8:30 గంటల నుంచి కనిపించకుండా పోయిన బాలురు ఆరు రోజులు గడుస్తున్నా ఇప్పటికీ వారి జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
నాగోల్‌లోని సాయిరాం నగర్‌కు చెందిన వరుణ్ తేజ్ (8), మహేష్ (6) అనే ఇద్దరు సోదరులు అదృశ్యమయ్యారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన చిన్నారులు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న నాగోల్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చిన్నారుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
ఇప్పటికే ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ చిన్నారుల కదలికలపై ఆరా తీస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఆచూకీ లభించకపోవడం కలకలం రేపుతోంది.
రూ.20 వేల నగదు బహుమతి
చిన్నారుల ఆచూకీ తెలిపిన వారికి రూ.20 వేల నగదు బహుమతి అందజేస్తామని పోలీసులు ప్రకటించారు. చిన్నారులను ఎవరైనా గుర్తించినా, వారి గురించి సమాచారం తెలిసినా వెంటనే పోస్టర్‌లో పేర్కొన్న ఫోన్ నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.
సమాచారం అందించాల్సిన నంబర్లు:
* 8790968873
* 8712662723
* 7569078160
* 8185886495
* 9550497857
చిన్నారుల ఫొటోలను వీలైనంత ఎక్కువ మందికి చేరవేసి వారి ఆచూకీ లభించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
చిన్నారులు క్షేమంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు.




