Chandanagar: చందానగర్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్!
Chandanagar: చందానగర్ రైల్వే స్టేషన్ సమీపంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి, 1.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
Chandanagar: చందానగర్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్!
Chandanagar: చందానగర్ పరిధిలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. చందానగర్ రైల్వే స్టేషన్ సమీపంలో కొందరు గంజాయి విక్రయిస్తున్నట్లు అందిన పక్కా సమాచారంతో టాస్క్ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం అరెస్ట్ అయిన వారిని విశాఖపట్నానికి చెందిన మనోజ్ కుమార్, విజయనగరానికి చెందిన ఆశా జ్యోతిగా గుర్తించారు. నిందితులు ఒడిశాలోని ‘కుందులి’ ప్రాంతం నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, హైదరాబాద్ తరలించి విక్రయిస్తున్నట్లు విచారణలో అంగీకరించారు.
పట్టుబడిన నిందితుల వద్ద నుంచి 1.5 కిలోల గంజాయితో పాటు 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితులపై ఎన్డీపీఎస్ (NDPS) చట్టం కింద కేసు నమోదు చేసి, తదుపరి విచారణ నిమిత్తం రిమాండ్కు తరలించారు.




