Hayathnagar: హయత్‌నగర్‌లో రెండు అదనపు సివిల్ కోర్టులు ప్రారంభం!
Hayathnagar: కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు హయత్‌నగర్‌లో ఏర్పాటు చేసిన రెండు అదనపు సివిల్ కోర్టులను హైకోర్టు న్యాయమూర్తులు ప్రారంభించారు.
Hayathnagar: హయత్‌నగర్‌లో రెండు అదనపు సివిల్ కోర్టులు ప్రారంభం!
Hayathnagar: కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు హయత్‌నగర్‌లో ఏర్పాటు చేసిన రెండవ, మూడవ అదనపు సివిల్ కోర్టులను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టాచార్య, జస్టిస్ నర్సింగ్‌రావు ప్రారంభించారు. నందికొండ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి జస్టిస్ కర్ణ కుమార్‌తో కలిసి కోర్టుల ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ కక్షిదారులకు త్వరితగతిన న్యాయం అందించాలనే ఉద్దేశంతో హయత్‌నగర్‌లో అదనంగా రెండు సివిల్ కోర్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కక్షిదారులు, న్యాయవాదులు ఈ కోర్టులను సద్వినియోగం చేసుకుని కేసుల సత్వర పరిష్కారానికి సహకరించాలని సూచించారు.
హయత్‌నగర్ పరిధిలో సుమారు 14 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు ఈ రెండు అదనపు కోర్టులు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి జస్టిస్ కర్ణ కుమార్ అన్నారు.
పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి హయత్‌నగర్ బార్ అసోసియేషన్ తరఫున పూర్తి సహకారం అందిస్తామని బార్ అసోసియేషన్ అధ్యక్షులు లింగం గౌడ్ తెలిపారు.




