Kothapet: వైభవంగా దేవీ నవరాత్రి జాగరణ: కాళీమాత రూపంలో అమ్మవారి దర్శనం

Kothapet: కొత్తపేటలో తుల్జా భవానీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి కాళీమాత రూపంలో ఉన్న అమ్మవారిని భక్తులు, ప్రముఖులు దర్శించుకున్నారు

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 16 Oct 2026 12:51 PM IST
Kothapet
X

Kothapet: వైభవంగా దేవీ నవరాత్రి జాగరణ: కాళీమాత రూపంలో అమ్మవారి దర్శనం

Kothapet: కొత్తపేటలోని ఎస్‌ఆర్‌ఎల్‌ కాలనీ రోడ్ నంబర్‌ 13లో తుల్జా భవానీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాళీమాత రూపంలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ప్రతి సంవత్సరం అమ్మవారి విగ్రహాన్ని నాగ్‌పూర్‌ నుంచి తీసుకొస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గత ఎనిమిదేళ్లుగా శ్రీధర్‌ ముదిరాజ్‌, దినేష్‌ ముదిరాజ్‌ సోదరులు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

నవరాత్రి జాగరణలో భాగంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి నామస్మరణతో కీర్తనలు, భజనలు ఆలపించారు. దీంతో ఎస్‌ఆర్‌ఎల్‌ కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కాలనీవాసులతో పాటు రాజకీయ ప్రముఖులు, పోలీసు అధికారులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR