Kadthal: పోచమ్మగడ్డ తండాలో తుల్జా భవాని ఆలయ పూజలు
Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం పోచమ్మగడ్డ తండాలో తుల్జా భవాని ఆలయ కడప, దర్వాజా నిలబెట్టే కార్యక్రమాన్ని నాయకులు, ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
Kadthal: పోచమ్మగడ్డ తండాలో తుల్జా భవాని ఆలయ పూజలు
రంగారెడ్డి జిల్లా : కడ్తాల్ మండల పరిధిలోని గనుగుమర్ల తండా గ్రామం పోచమ్మగడ్డ తండాలో తుల్జా భవాని అమ్మవారి ఆలయంలో కడప, దర్వాజా నిలబెట్టే కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమంగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, గిరిజన సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు హనుమ నాయక్, సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కడ్తాల్ మండల ఉపసర్పంచుల సంఘం అధ్యక్షుడు జర్పుల లక్పతి నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
తండా ప్రజల సమక్షంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఆలయ నిర్మాణం పూర్తయిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు భిక్షపతి, బిక్కు నాయక్, సేవాలాల్ సేన రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ నాయకుడు రాజు నాయక్, వార్డు సభ్యుడు రాజు నాయక్, మాజీ వార్డు సభ్యులు రాణి జగన్ నాయక్, టిక్లాల్ నాయక్, దేశ్య నాయక్, కిషన్ నాయక్, పండు నాయక్, బాలు నాయక్, రాజేందర్ నాయక్, వికాస్, రాకేష్, వెంకటేష్, గోపి, యువకులు, తండా ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




