LB Nagar: బీఆర్ఎస్-బీజేపీ పొత్తుపై కేటీఆర్ స్పష్టత ఇవ్వాలి: నరేష్!
LB Nagar: మా పార్టీపై విమర్శలు చేస్తే ఊరుకోం: ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై తెలంగాణ రక్షణ సేన ఇన్చార్జ్ దూగుంట్ల నరేష్ ఫైర్. బీఆర్ఎస్-బీజేపీ పొత్తుపై కేటీఆర్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్.
LB Nagar: బీఆర్ఎస్-బీజేపీ పొత్తుపై కేటీఆర్ స్పష్టత ఇవ్వాలి: నరేష్!
ఎల్బీనగర్: తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక సంకల్ప సభపై ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ దూగుంట్ల నరేష్ ప్రజాపతి తీవ్రంగా ఖండించారు. ఎల్బీనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఎమ్మెల్యే వ్యాఖ్యలపై స్పందించారు.
కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రక్షణ సేన ఒక్కటేనని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వ్యాఖ్యానించడం సరికాదని నరేష్ అన్నారు. నియోజకవర్గ సమస్యలను పరిష్కరిస్తానని చెప్పి పార్టీలు మారింది ఎవరో ఎమ్మెల్యే ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
అదే సమయంలో బీఆర్ఎస్–బీజేపీ పొత్తు ఉంటుందని సుధీర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పష్టత ఇవ్వాలని నరేష్ డిమాండ్ చేశారు. అది ఎమ్మెల్యే వ్యక్తిగత అభిప్రాయమా? లేక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారిక అభిప్రాయమా? అనేది ప్రజలకు తెలియజేయాలని కోరారు.
ఎల్బీనగర్లోని భూ సమస్యల్లో జీవో 118 అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని నరేష్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో చంద్రబాబు నాయుడు తనకు టికెట్ ఇచ్చారంటూ ఎమ్మెల్యే చెబుతున్న అంశంపైనా ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరారు.
ఇటీవల భూవ్యవహారాలపై ముఖ్యమంత్రి చేసిన ఆరోపణల నేపథ్యంలో వాటిపై ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని నరేష్ డిమాండ్ చేశారు. ఆరోపణలకు సంబంధించిన వాస్తవాలను ఆధారాలతో వెల్లడించాలని కోరారు.
తెలంగాణ రక్షణ సేనపై అనవసర విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని, ప్రజా సమస్యలపై తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని దూగుంట్ల నరేష్ ప్రజాపతి స్పష్టం చేశారు.
కార్యక్రమంలో బీఎన్‌రెడ్డి డివిజన్ నాయకుడు లో బ్లెస్సో సామ్యూల్, హయత్‌నగర్ నాయకురాలు మరేం సునీతారెడ్డి, ఎన్టీఆర్నగర్ నాయకుడు పోలె ప్రదీప్, గురంఖ్ సింగ్, క్రాంతికుమార్, సందీప్, వినయ్‌చంద్, సాయి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.




