Kadthal: సేవాలాల్ మహారాజ్ విగ్రహ భూమిపూజను విజయవంతం చేయాలి!

Kadthal: మద్దిమడుగులో రూ. 169 కోట్లతో చేపట్టనున్న సేవాలాల్ మహారాజ్ విగ్రహ నిర్మాణ భూమిపూజను విజయవంతం చేయాలని సేవాలాల్ సేన నేత జర్పుల లక్పతి నాయక్ పిలుపునిచ్చారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 27 Nov 2026 10:19 AM IST
Kadthal
X

Kadthal: సేవాలాల్ మహారాజ్ విగ్రహ భూమిపూజను విజయవంతం చేయాలి!

Kadthal: మద్దిమడుగులో సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహ నిర్మాణ భూమిపూజ కార్యక్రమం సందర్భంగా గురువారం కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండల కేంద్రంలోని గిరిజన కమిటీ హాల్‌లో సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని గిరిజనులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రూ.169 కోట్ల వ్యయంతో సేవాలాల్ మహారాజ్ విగ్రహ నిర్మాణం చేపట్టడం గిరిజన సమాజానికి గర్వకారణమని అన్నారు.ఈ సందర్భంగా సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు జర్పుల లక్పతి నాయక్ మాట్లాడుతూ.. సేవాలాల్ మహారాజ్ విగ్రహ నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ గిరిజనుల సంక్షేమానికి ఏం చేసిందని ప్రశ్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.169 కోట్లతో సేవాలాల్ మహారాజ్ విగ్రహ నిర్మాణం చేపడుతుంటే బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని ఖండించారు.

అనంతరం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కడ్తాల్‌లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ మార్కెట్ చైర్మన్ యాట గీత నర్సింహా, వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, కడ్తాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్, మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బిచ్య నాయక్, కడ్తాల్ సర్పంచ్ భిక్షపతి, సేవాలాల్ సేన రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జర్పుల రవీందర్ నాయక్, కడ్తాల్ మండల అధ్యక్షులు రమేష్ నాయక్, రేవంత్ వ్యవస్థాపక అధ్యక్షులు చందోజీ, సేవాలాల్ సేన మండల యువజన అధ్యక్షులు తేజు నాయక్, నాయకులు రామ్ చంద్ నాయక్, జంగీర్ బాబా, రాజు, జర్పుల సేవ్యా నాయక్, క్యామ రాజేష్, షాబుద్దీన్, మోతీలాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.ఆమనగల్ 13వ వార్డు డంపింగ్ యార్డును తక్షణమే తరలించాలి.

ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి – ఆమనగల్ మున్సిపాలిటీ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ జంతుక శివ.రంగారెడ్డి జిల్లాఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో ఉన్న డంపింగ్ యార్డు వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమనగల్ మున్సిపాలిటీ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ జంతుక శివ ఆవేదన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డును ఆయన స్వయంగా సందర్శించి, అక్కడి పరిస్థితులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డంపింగ్ యార్డు నుంచి వెలువడుతున్న తీవ్రమైన దుర్వాసనతో పాటు దోమలు, ఈగల బెడద అధికమై స్థానిక ప్రజలు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.ప్రజల ఆరోగ్యాన్ని, పరిసరాల పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకుని 13వ వార్డులోని డంపింగ్ యార్డును తక్షణమే అక్కడి నుంచి తొలగించి, జనావాసాలకు దూరంగా ఉన్న అనువైన ప్రాంతానికి తరలించాలని మున్సిపల్ అధికారులను జంతుక శివ డిమాండ్ చేశారు.ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఈ కీలక సమస్యపై అధికారులు నిర్లక్ష్యం వహించకుండా వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని కోరారు. డంపింగ్ యార్డు సమస్యకు తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన స్పష్టం చేశారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY