Shabad: షాబాద్‌లో కంది పంట సాగు యాజమాన్యంపై రైతులకు అవగాహన!

Shabad: షాబాద్, చెర్లగూడెంలో మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ (MANP) కింద కంది పంట సాగుపై శిక్షణ, క్షేత్ర సందర్శన. సస్యరక్షణపై రైతులకు అవగాహన.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 12 Oct 2026 1:32 PM IST
Shabad
X

Shabad: షాబాద్‌లో కంది పంట సాగు యాజమాన్యంపై రైతులకు అవగాహన!

Shabad: షాబాద్ మండలం, షాబాద్, చెర్లగూడెం గ్రామాలలో మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ (ఎంఏఎన్‌పీ) 2026–27 పథకం కింద ఈ రోజు కందుల పంట బ్లాక్ డెమాన్‌స్ట్రేషన్లపై శిక్షణ కార్యక్రమం, క్షేత్ర సందర్శన నిర్వహించడం జరిగినది.

ఈ కార్యక్రమం ద్వారా రైతులకి పథకం లక్ష్యాలు, కందిపంట సాగులో శాస్త్రీయ పద్ధతుల అమలు, ఉత్పాదకత పెంపు తదితర అంశాలపై మండల వ్యవసాయ అధికారి దండెం. విజయచంద్ర అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో భాగంగా కందిపంట సాగులో సిఫారసు చేసిన సాగు పద్ధతులపై శిక్షణ, సమతుల్య ఎరువుల వినియోగం, సూక్ష్మపోషకాలైన జింక్ సల్ఫేట్, బోరాన్ వినియోగంపై సమగ్ర పోషక నిర్వహణకు సంబంధించిన సూచనలు అందించారు.

అలాగే, ప్రధాన పురుగులు మరియు తెగుళ్లను గుర్తించడం, పర్యవేక్షించడం, సకాలంలో నివారణ చర్యలు చేపట్టడం, సిఫారసు చేసిన కంది పంట సస్యరక్షణ పద్ధతులను పాటించడం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.

అనంతరం కంది పంటల ప్రదర్శన క్షేత్రాలను సందర్శించి పంట ఎదుగుదల, పంట పరిస్థితి, రైతులు అనుసరిస్తున్న శాస్త్రీయ సాగు పద్ధతులను పరిశీలించారు. రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, పంట నిర్వహణ పద్ధతులు, కందుల ఉత్పాదకత పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

బ్లాక్ డెమాన్‌స్ట్రేషన్ల పురోగతిని సమీక్షిస్తూ, మెరుగైన సాంకేతిక పద్ధతులను రైతులు స్వీకరించి కందుల ఉత్పత్తిని పెంచి, కంది పంటలో ఆత్మనిర్భరత సాధించే లక్ష్యానికి సహకరించాలని వ్యవసాయ అధికారి సూచించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు శివజేజ, రాజేశ్వరి, శైలజ, ఉద్యాన విస్తరణ అధికారి బలరాం, చెర్లగూడెం సర్పంచ్ మల్కాపురం పెంటయ్య, మన్మర్రి సర్పంచ్ బందెయ్య, షాబాద్ రైతు ఫెడ్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సి.ఈ.ఓ కందివవనం. చంద్రశేఖర్ రెడ్డి, మహిళా రైతులు అమృత, రేణుక, భారతమ్మ, రైతులు యట్టయ్య, మల్లేష్ , హైతబాద్ జంగయ్య, వెంకటయ్య గౌడ్, యాదగిరి గౌడ్, మహేశ్వర్ రెడ్డి, పాండయ్య, రాజేoదర్ రెడ్డి, స్వప్న వెంకటమ్మ, తదితరులు పాల్గొన్నారు. పథకం సమర్థవంతమైన అమలు, సాంకేతిక పరిజ్ఞానం రైతులకు చేరవేత లక్ష్యంగా కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA