Yellampet: మేడ్చల్ ఎల్లంపేట్‌లో విషాదం.. విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి!
Yellampet: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లంపేట్ గ్రామంలో ఫంక్షన్ కోసం టెంట్ వేస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి దేవేందర్, బాబు అక్కడికక్కడే మృతి చెందారు.
Yellampet: మేడ్చల్ ఎల్లంపేట్‌లో విషాదం.. విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి!
మేడ్చల్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లంపేట్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఫంక్షన్ కోసం టెంట్ ఏర్పాటు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగలడంతో దేవేందర్ మరియు బాబు అనే ఇద్దరు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




