Tarnaka: తార్నాకలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన!

Tarnaka: ఉస్మానియా యూనివర్సిటీ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన.

HARISH, TARNAKA
Published on: 29 Sept 2026 3:15 PM IST
Tarnaka
X

Tarnaka: తార్నాకలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన!

Tarnaka: ఓయూ, మాణికేశ్వరి నగర్ పరిధిలో ఉస్మానియా యూనివర్సిటీ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియమ నిబంధనలు, రహదారి భద్రతపై డ్రైవర్లకు అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని సూచించారు.

ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, వాహనం నడుపుతున్న సమయంలో సెల్‌ఫోన్‌ వినియోగించరాదని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ సురక్షిత ప్రయాణానికి సహకరించాలని పోలీసులు సూచించారు. ఈ కార్యక్రమంలో సుమారు 40 మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA