Hyderabad: హరీష్ రావుపై మెట్టు సాయికుమార్ నిప్పులు

Hyderabad: మేడిగడ్డ, కాళేశ్వరం పాపం కేసీఆర్, హరీష్ రావులదేనని, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఆగం చేసిందని టీపీసీసీ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ధ్వజమెత్తారు.

G. Rama Krishna, Hyderabad
Published on: 25 Oct 2026 6:38 PM IST
Hyderabad
X

Hyderabad: హరీష్ రావుపై మెట్టు సాయికుమార్ నిప్పులు

హైదరాబాద్: హరీష్ రావు, Brs నేతల పై టిపిసిసి ఫిషరీష్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ హాట్ కామెంట్స్, Brs అంటే బలాదూర్ రాష్ట్ర సమితి ,బెకార్ రాష్ట్ర సమితి, బట్టేబాజ్ రాష్ట్ర సమితి పది సంవత్సరాలు రాష్ట్రాన్ని ఆగం చేసిన దుర్మార్గులు ఇప్పుడు శ్రీ రంగ నీతులు మాట్లాడుతున్నారు.

హరీష్ రావు అంటే తన్నీరు హరీష్ రావు కాదు, అబద్దాల హరీష్ రావు, అబద్దాలు ఆడటం లో హరీష్ రావు మామ ను మించిండు, రోజు 100 నుండి మొదలు పెట్టి వెయ్యి అబద్దాలు మాట్లాడుతాడు ఏరోజు హరీష్ రావు నిజాలు మాట్లాడడు మెడి గడ్డ పాపం,కేసీఆర్ హరీష్ రావులది..

కాళేశ్వరం, మెడిగడ్డ పాపం మోయాల్సింది కేసీఆర్, హారీష్ రావు ఇద్దరు దుర్మార్గులే, హరీష్ రావు ఎంత మోతేబరి మాటలు మాట్లాడినా హరీష్ రావు ను brs నాయకులు పట్టించుకోట్లేదు, నిన్న మెడిగడ్డ కు పోయిన Brs నాయకులు హరీష్ రావు గల్లా పట్టుకొని అడగండి, మెడి గడ్డ, కాళేశ్వరం లో లో కెసిఆర్ కు ఎంత పాపం ఉందొ, హరీష్ రావు కు అంత పాపం ఉంది.

Brs చేసిన పాపం చూడాలనే నిన్న మిమ్ముల్ని మెడి గడ్డ పోనిచ్చాం కమిషన్ల కోసం కక్కుర్తి పడి మెడి గడ్డను కూల్చేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కు,పద్మారావు కు నాయకత్వ లక్షణాలు లేవా?

హరీష్ రావు Brs లో నెంబర్2 కావడానికి ప్రయత్నం చేస్తుండు, హరీష్ రావు ఎగిరి దంచినా?ఎగిరెగిరి దంచినా Brs లో నెంబర్2 కాలేడు, తలసాని శ్రీనివాస్ యాదవ్ సీనియర్ 5సార్లు ఎమ్మెల్యే గా గెలిచిండు Brs కు తలసాని శ్రీనివాస్ యాదవ్,పద్మారావు కు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యే అర్హత లేదా?

కుత్బుల్లాపూర్ లో వివేకానంద గౌడ్ చేసిన అక్రమాలు.. అన్ని ఇన్ని చాలా వున్నాయి. అద్దెకు వచ్చిన నాయకులు,తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, వివేకానంద గౌడ్.

G. Rama Krishna, Hyderabad

G. Rama Krishna, Hyderabad