Pargi: వికారాబాద్ జిల్లా పరిగిలో పెద్దపులి సంచారంతో తీవ్ర భయాందోళన!

Pargi: వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో పెద్దపులి సంచారం కలకలం. గోశాలపై పులి దాడి చేసి ఆవును హతమార్చిన వైనం. భయాందోళనలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు.

WAZID, PARIGI
Published on: 27 Sept 2026 10:10 AM IST
Pargi
X

Pargi: వికారాబాద్ జిల్లా పరిగిలో పెద్దపులి సంచారంతో తీవ్ర భయాందోళన!

Pargi: బసిరెడ్డిపల్లి సమీపంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

కృష్ణగిరి క్షేత్ర ఆలయ పరిధిలోని గోశాలలో ఉన్న గోవులపై పులి దాడి చేసినట్లు గో సంరక్షకులు చెబుతున్నారు.మూడు రోజుల క్రితం ఓ లేగదూడను పులి ఎత్తుకెళ్లినట్లు సమాచారం.తాజాగా మరో ఆవుపై పులి దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గోశాలలో ఉన్న ఆవుపై పులి దాడి చేస్తున్న సమయంలో గో సంరక్షకుడు గమనించి గట్టిగా కేకలు వేయడంతో పులి అక్కడి నుంచి అడవిలోకి పారిపోయినట్లు చెబుతున్నారు.

ఈ దాడిలో ఆవు మెడ, ఉదర భాగంలో తీవ్ర గాయాలయ్యాయి.

ఆవు వీపుపై పులి పంజా ఆనవాళ్లు కూడా కనిపించినట్లు గో సంరక్షకులు తెలిపారు. తీవ్ర గాయాలతో ఆవు మృతి చెందింది.మరోవైపు... గోశాల సమీపంలోని ఫామ్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో పులి కదలికలు రికార్డైనట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

ఈ గోశాలలో దాదాపు 200 వరకు ఆవులు ఉన్నాయని గోశాల నిర్వాహకుడు కృష్ణస్వామి తెలిపారు. పులి సంచారంతో గోవుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ అధికారులు వెంటనే స్పందించి పులిని గుర్తించి బంధించి, గోశాలకు మరియు చుట్టుపక్కల గ్రామాలకు రక్షణ కల్పించాలని కృష్ణస్వామి కోరుతున్నారు.పులి సంచారం నిజమేనా? అయితే అది ఏ ప్రాంతం నుంచి వస్తోంది.

దానిని పట్టుకునేందుకు అటవీశాఖ ఎలాంటి చర్యలు చేపడుతుందనేది ఇప్పుడు స్థానికంగా ఆసక్తికరంగా మారింది.పులి సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

WAZID, PARIGI

WAZID, PARIGI