Medchal: నిందితుల వద్ద రూ. 3.50 లక్షల నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం!

Medchal: తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేసి రూ. 3.50 లక్షల నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

PURENDAR, ALWAL
Published on: 28 Nov 2026 3:29 PM IST
Medchal
X

Medchal: నిందితుల వద్ద రూ. 3.50 లక్షల నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం!

Medchal: తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు అల్వాల్‌ ఏసీపీ రమేష్‌ తెలిపారు. శనివారం అల్వాల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఏసీపీ రమేష్‌ మాట్లాడుతూ.. ఆదిలాబాద్‌ జిల్లా మావల మండలానికి చెందిన మహమ్మద్‌ ఇమ్రాన్‌ (23) తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి చోరీలకు పాల్పడేవాడని తెలిపారు. అల్వాల్‌, శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని బొంతుర్గూడ, బొల్లారం, ఓల్డ్‌ అల్వాల్‌, శంషాబాద్‌ ప్రాంతాల్లో మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందన్నారు. దొంగిలించిన సొత్తును ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన షేక్‌ నోమన్‌ (27) సహాయంతో విక్రయించేందుకు ప్రయత్నించినట్లు పేర్కొన్నారు.చోరీ కేసుల దర్యాప్తులో భాగంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడంతో పాటు సాంకేతిక ఆధారాలు సేకరించామని ఏసీపీ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు నవంబరు 27న అల్వాల్‌లోని ఫాదర్‌ బలయ్య నగర్‌ సమీపంలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

వారి నుంచి అల్వాల్‌ పరిధి కేసులకు సంబంధించి రూ.2 లక్షల నగదు, 22.99 గ్రాముల బంగారు బిస్కెట్‌, డ్రిల్లింగ్‌ మిషన్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. శంషాబాద్‌ కేసుకు సంబంధించి రూ.1.50 లక్షల నగదుతో పాటు నెక్లెస్‌, నల్లపూసల ఆభరణాలు, ఉంగరాలు, చెవి దిద్దులు, పెండెంట్లు తదితర బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లు వివరించారు. మొత్తం రూ.3.50 లక్షల నగదు, బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఏసీపీ రమేష్‌ ప్రజలకు సూచించారు. చోరీ కేసులను సమర్థంగా ఛేదించిన అల్వాల్‌ పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారని తెలిపారు.

PURENDAR, ALWAL

PURENDAR, ALWAL