Hyderabad: ఉద్యోగాల పేరుతో రష్యా వెళ్లి మోసపోయిన తెలంగాణ యువకులు!
Hyderabad: నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన నలుగురు యువకులు ఉపాధి కోసం రష్యా వెళ్లి సైనిక సేవల్లో చిక్కుకోవడం కలకలం.
Hyderabad: ఉద్యోగాల పేరుతో రష్యా వెళ్లి మోసపోయిన తెలంగాణ యువకులు!
Hyderabad: ఉద్యోగాల పేరుతో రష్యాకి వెళ్లిన తెలంగాణ యువకులు మోసపోయారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన నలుగురు యువకులను నెలకు రెండు లక్షల రూపాయల జీతంతో తోటలో శుభ్రం చేసే ఉద్యోగాలు ఇప్పిస్తామని ఏజెంట్లు మోసం చేశారు. ఒక్కొక్కరు మూడు లక్షల రూపాయలు చెల్లించి రష్యా వెళ్లారు.
తీరా అక్కడ వెళ్లిన తర్వాత యువకులను రష్యా సైనిక సేవలోకి తీసుకున్నారని.. కొందరిని ఉక్రెయిన్ సరిహద్దుకు తరలించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉన్న డొనెట్స్క్ ప్రాంతంలో యువకులు ఉన్నట్లు కుటుంబాలు చెబుతున్నాయి.
అక్కడి నుంచి వారు పంపిన ఆడియో సందేశాల్లో ఫిరంగి కాల్పులు, బాంబు దాడుల శబ్ధం వినిపిస్తున్నట్లు తెలిపారు. తమ కుమారులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.




