Hyderabad: ముదిరాజులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి!

Hyderabad: కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ నాయకులు డిమాండ్ చేశారు.

RAJESH,	WEST ZONE
Published on: 14 Nov 2026 4:40 PM IST
Hyderabad
X

Hyderabad: ముదిరాజులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి!

Hyderabad: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ముదిరాజ్ సామాజిక వర్గం ముఖ్య పాత్ర పోషించిందని వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తాచ్చరం చేయడం ఎంత మాత్రం సబబు కాదని తెలంగాణ మన ముదిరాజ్ సభ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ మేరకు సోమాజిగూడ,ప్రెస్ క్లబ్ లో సత్తయ్య ముదిరాజ్, పండుగ బాలు ముదిరాజ్, ఎర్రబోయిన ఉష,నీలం శ్వేత బాలు,తదితర ముదిరాజ్ నాయకులు పాల్గొని మాట్లాడారు.

తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ ఆవిర్భవించి 12 సంవత్సరాలు గడుస్తున్నందున 21వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ముదిరాజులందరూ ముదిరాజ్ జెండా ఎగరవేసి ఐక్యత చాటాలని అన్నారు.

ఇప్పటికే మన ముదిరాజ్ మహాసభ అనేక పోరాటాలు చేసి విజయాలు దక్కించుకుందని అన్నారు. రాబోవు రోజులలో ప్రభుత్వం ముదిరాజుల కు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ముదిరాజ్ డిమాండ్లు అయినా అనేక అంశాలను ప్రజాక్షేత్రంలో ఉంచి పోరాటం చేస్తామని హెచ్చరించారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE