Hyderabad: మదీనగూడలో తెలంగాణ విమోచన దినోత్సవం!
Hyderabad: మియాపూర్ మదీనగూడలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
Hyderabad: మదీనగూడలో తెలంగాణ విమోచన దినోత్సవం!
Hyderabad: భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనమైన చారిత్రాత్మక రోజైన సెప్టెంబర్ 17 పురస్కరించుకుని మదీనగూడ డివిజన్‌లో "తెలంగాణ విమోచన దినోత్సవ" వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయం వద్ద ఉదయం 7:00 గంటలకు నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ నిజాం బంధీల నుంచి తెలంగాణ విముక్తి పొందేందుకు 1948 సెప్టెంబర్ 17 వరకు వేచి చూడాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ సమర్థ నాయకత్వంలో చేపట్టిన 'ఆపరేషన్ పోలో' (పోలీస్ యాక్షన్) ఫలితంగానే హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైందని కొనియాడారు. ఈ పోరాటంలో తెలంగాణ, మరాఠ్వాడా, కర్ణాటక ప్రాంత ప్రజల త్యాగాలు ఎనలేనివని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ అజిత్ కుమార్, మాజీ కౌన్సిలర్ వెంకటరామయ్య, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ సత్యనారాయణ రాజు హాజరయ్యారు.
సుమారు 30 మందికి పైగా సీనియర్ కార్యకర్తలు, బంధుమిత్రుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమరవీరులకు నివాళులర్పించారు. మదీనగూడ డివిజన్ కార్యకర్తల నిరంతర సహకారం, అండదండలతోనే ఈ వేడుకలు విజయవంతమయ్యాయని నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. 'అమరవీరులు అమర్ రహే', 'భారత్ మాతాకీ జై' నినాదాలతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి.




