Hyderabad: తెలంగాణలో కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు - 1.24 లక్షల విగ్రహాలు!

Hyderabad: తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న గణేష్ నిమజ్జన కార్యక్రమాలు. రాష్ట్రంలో మొత్తం 1.24 లక్షల విగ్రహాలు ఉన్నట్లు తెలిపిన డీజీపీ సీవీ ఆనంద్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 Sept 2026 10:42 AM IST
Hyderabad
X

Hyderabad: తెలంగాణలో కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు - 1.24 లక్షల విగ్రహాలు!

Hyderabad: ఇవాళ కూడా తెలంగాణలో గణేష్‌ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న లెక్కల ప్రకారం..1 లక్ష 24 వేల విగ్రహాలు ఉన్నాయని డీజీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు.

గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది విగ్రహాల సంఖ్య పెరిగిందన్నారు. ఇవాళ మధ్యాహ్నం వరకు నిమజ్జనాలు కొనసాగుతాయన్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డ్రోన్స్‌తో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశామని డీజీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్