Osmania University: రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్ అధ్యాపకుల పోస్ట్‌కార్డు ఉద్యమం షురూ!

Osmania University: రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని కోరుతూ ఓయూలో సీఎం, గవర్నర్‌లకు పోస్ట్‌కార్డులు పంపి నిరసన తెలిపారు.

HARISH, TARNAKA
Published on: 27 Nov 2026 5:06 PM IST
Osmania University
X

Osmania University: రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్ అధ్యాపకుల పోస్ట్‌కార్డు ఉద్యమం షురూ!

ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను తక్షణమే క్రమబద్ధీకరించి, ఉద్యోగ భద్రత కల్పించాలని యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ లో పోస్ట్ కార్డు ను సీఎం, గవర్నర్ లకు పంపి తమ నిరసనను వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో సమ్మె చేసిన సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు యూజీసీ పే స్కేల్ అమలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తమను క్రమబద్ధీకరించి రెగ్యులర్ సర్వీసులో విలీనం చేయాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించేలా ప్రభుత్వం జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, కొత్త నియామక నోటిఫికేషన్లు విడుదల చేసే ముందే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల కార్యకలాపాలను స్తంభింపజేసేలా భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని కాంట్రాక్ట్ అధ్యాపకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కార్యదర్శి డాక్టర్ జయశ్రీతో, డాక్టర్ మోడెం రవి, డాక్టర్ కర్ణాకర్, డాక్టర్ మహేందర్, డాక్టర్ కృష్ణారెడ్డి, డాక్టర్ విజయ్, డాక్టర్ పర్బేశ్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ కవిత, డాక్టర్ సునీత, డాక్టర్ శ్రీదుర్గ, డాక్టర్ అనిత, డాక్టర్ రేణు, డాక్టర్ మీనా, డాక్టర్ అజిత్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA