Hyderabad: టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి గుండెపోటు!
Hyderabad: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అస్వస్థతతో కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు గుండెపోటు వచ్చినట్లు వైద్యులు నిర్ధారించి, స్టెంట్‌లో బ్లాక్ తొలగించారు.
Hyderabad: టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి గుండెపోటు!
Hyderabad: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు ఛాతీ నొప్పితో కిమ్స్ ట్రస్ట్ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రికి వచ్చిన వెంటనే పరీక్షించిన వైద్యులు ఆయనకు గుండెపోటు (హార్ట్ ఎటాక్) వచ్చినట్లు నిర్ధారించారు.
కార్డియాలజిస్టులు డాక్టర్ నిశాంత్, డాక్టర్ పవన్ ఆంజియోగ్రామ్ నిర్వహించగా, పూర్వపు స్టంట్‌లో బ్లాక్ ఉన్నట్లు కనుగొన్నారు. వెంటనే ఆ బ్లాక్‌ను తొలగించి, రక్తం సరఫరాను పునరుద్ధరించారు.
ప్రస్తుతం ఆయనను రెండు రోజుల పాటు ఐసీయూ (ICU) అబ్జర్వేషన్ లో ఉంచనున్నట్లు వైద్యులు తెలిపారు. రేపు ఉదయం ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబు ఆరా:
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యనమల రామకృష్ణుడి ఆరోగ్య పరిస్థితిపై వెంటనే స్పందించారు. కిమ్స్ కార్డియాలజిస్టులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని, ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహకారం ఉంటుందని ఆదేశించారు




