Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి, 14 మంది అరెస్ట్!

Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలోని ఐఎస్ సదన్ ప్రాంతంలో పేకాట స్థావరంపై టాస్క్‌‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి 14 మందిని అదుపులోకి తీసుకున్నారు.

MOHD MOHIUDDIN, YAKUTHAPURA
Published on: 2 Oct 2026 10:06 AM IST
Hyderabad
X

Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి, 14 మంది అరెస్ట్!

Hyderabad: హైదరాబాద్ పాతబస్తీ లో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐఎస్ సదన్ చౌరస్తా సమీపంలోని ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట నిర్వహిస్తున్నట్లు గుర్తించిన చార్మినార్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు.

ఈ దాడిలో పేకాట ఆడుతున్న 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1,07,300 నగదు, 14 మొబైల్ ఫోన్లు, రెండు ప్లేయింగ్ కార్డ్స్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. పేకాట నిర్వహిస్తున్న వారిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

MOHD MOHIUDDIN, YAKUTHAPURA

MOHD MOHIUDDIN, YAKUTHAPURA