Tarnaka: హనుమాన్‌నగర్‌లో ఘనంగా గణపతి మహా హారతి, డాండియా వేడుకలు
Tarnaka: తార్నాక హనుమాన్‌నగర్‌లో ఘనంగా గణపతి మహా హారతి మరియు డాండియా వేడుకలు. హాజరైన మాజీ మేయర్ బండ కార్తికా రెడ్డి.
Tarnaka: హనుమాన్‌నగర్‌లో ఘనంగా గణపతి మహా హారతి, డాండియా వేడుకలు
తార్నాక: తార్నాక హనుమాన్‌నగర్‌లో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి మహా హారతి నిర్వహించారు. అనంతరం దాండియా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి మాజీ మేయర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తికా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హనుమాన్‌నగర్‌లో గత 27 ఏళ్లుగా గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పది రోజులపాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన అనంతరం శుక్రవారం గణనాథుడి నిమజ్జన కార్యక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు.
మహా హారతి కార్యక్రమంలో కాలనీ వాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. నిమజ్జనంతో గణపతికి వీడ్కోలు పలుకుతూ వచ్చే ఏడాది మరింత త్వరగా రావాలని విఘ్నేశ్వరుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. భక్తులందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని గణనాథుడిని ప్రార్థిస్తున్నట్లు బండ కార్తికా రెడ్డి పేర్కొన్నారు.




