Tandur: పీర్ ఫఖీర్ షా దర్గా 475వ ఉర్సు: పైలెట్ రోహిత్ రెడ్డి ప్రార్థనలు!
Tandur:తాండూరులోని ప్రముఖ హజ్రత్ సయ్యద్ పీర్ ఫఖీర్ షా ఖాద్రీ దర్గా 475వ ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Tandur: పీర్ ఫఖీర్ షా దర్గా 475వ ఉర్సు: పైలెట్ రోహిత్ రెడ్డి ప్రార్థనలు!
తాండూరు: భక్తుల ఆరాధ్య దైవంగా భావించే ప్రముఖ ప్రసిద్ది గాంచిన తాండూరు పట్టణ సమీపంలోని నారాయణపూర్ రోడ్డులో ఉన్న హజ్రత్ సయ్యద్ పీర్ ఫఖీర్ షా ఖాద్రీ దర్గా 475వ ఉర్సు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం దర్గాను మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దర్శించుకున్నారు.
గంధం, పట్టు వస్త్రాలు, చాదర్, ఈతర్ను సమర్పించారు. దర్గా నిర్వాహకులు మాజీ ఎమ్మెల్యేను శాలువలతో, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. గంధం ( సంధల్ ) ఊరేగింపు భక్తిశ్రద్ధలతో సాగింది. గంధం సమర్పణ కార్యక్రమం కనులపండువగా నిర్వహించారు. ముస్లిం ఖవ్వాలి బృందం ఆధ్వర్యంలో గేయాలాపాన కార్యక్రమం జరిగింది. ఫకీర్ణ విన్యాసాలు అబ్బురపరిచాయి.
ఈ సందర్భంగా ఆయన దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని చెందాలని ప్రార్థించారు. మత సామరస్యం, సోదరభావం, శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు.




