Tandur: తాండూరు ఎంసీహెచ్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతి!

Tandur: తాండూరు ప్రభుత్వ ఎంసీహెచ్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతి.. న్యాయం చేయాలంటూ తల్లిదండ్రుల ఆందోళన, అధికారులకు వినతి పత్రం.

Srikanth Reddy, Tandur
Published on: 24 Sept 2026 5:25 PM IST
Tandur
X

Tandur: తాండూరు ఎంసీహెచ్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతి!

Tandur: నవజాత శిశువు మృతితో తల్లిదండ్రుల వేదన తో ఎం సి హెచ్ ఆవరణ నిశ్శబ్ద వాతావరణ సంతరించుకుంది. ఆరోగ్యంగా ఉన్న నవజాత శిశువు ఒక్కసారిగా సీరియస్ అయ్యారని డాక్టర్లు చెప్పడం, నీలోఫర్ కి రెఫర్ చేయడంతో ఏమీ తోచని ఆ తల్లిదండ్రులు హుటాహుటిన నవజాత శిశువును తీసుకొని నీలోఫర్ కి చేరిన కొన్ని గంటల్లోనే శిశువు మృత్యువార్తతో కన్నీటి పర్యంతమయ్యారు.

కోస్గి దగ్గరలోని కడంపల్లి గ్రామానికి చెందిన శివలీల,శ్రీనివాస్ దంపతులు తమ రెండవ డెలివరీ కోసం తాండూరు ఎం సి హెచ్ ఆసుపత్రికి ఈనెల 17వ తేదీన రాగా 18వ తేదీన సిజేరియన్ ఆపరేషన్ చేసిన వైద్యులు పండంటి మగ బిడ్డను వారి చేతుల్లో పెట్టి, శిశువు అంత బలంగా లేదని ఇంక్విలేటర్ లో పెట్టాలని రెండు రోజులుగా ఇంక్విలేటర్ లో పెడుతూ శిశువు ఆరోగ్యకరంగా ఉన్నాడని తల్లిదండ్రులకు చెప్తూ వచ్చారు.

ఆదివారం సాయంత్రం శిశువు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వెంటనే నీలోఫర్ కి తీసుకువెళ్లాలని డాక్టర్ జైదీప్ రెడ్డి చెప్పడంతో తల్లిదండ్రులకు ఏమి చేయాలో పాలు పోక వెంటనే శిశువుని తీసుకొని నీలోఫర్ కి చేరుకున్నారు. చేరుకున్న రెండు మూడు గంటల్లోనే శిశువు మృత్యువాత పడ్డ విషయాన్ని వైద్యులు తల్లిదండ్రులకు చెప్పడంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా మారిపోయింది.

తమకు న్యాయం చేయాలని తమ బిడ్డను తమకు దూరం చేసిన వైద్యురాలు శిల్పిక పై చట్టపరమైన చర్యలు అధికారులు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ వినతి పత్రాన్ని గురువారం ఎం సి హెచ్ అధికారులకు అందజేశారు. ఇద్దరు సంతానం చాలనుకొని వారు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కూడా ఎం సి హెచ్ లోనే చేయించుకోవడం జరిగిందని తల్లిదండ్రులు వాపోయారు.

డాక్టర్ పైన చర్యలు తీసుకొని భవిష్యత్తులో తమలాంటి కడుపుకోతను మరెవ్వరికీ రాకుండా అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వైద్యుల నిర్లక్ష్యంతో తమకు కడుపుకోత మిగిలిందని తమ కడుపుకోతకు ఎం సి హెచ్ వైద్యులే కారణమని వారి పైన చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని ఆ దిశగా జిల్లా వైద్యాధికారులు , రాష్ట్ర వైద్యాధికారులు, స్థానిక ఎమ్మెల్యే కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అని తెలిపారు.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur