Vikarabad: పెద్దేముల్‌లో నూతన కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే!
Vikarabad: వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా లొంక నరసింహులు బాధ్యతలు స్వీకరించారు.
Vikarabad: పెద్దేముల్‌లో నూతన కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే!
Vikarabad: కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులకు ఎల్లప్పుడూ తగిన గౌరవం లభిస్తుందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా లొంక నరసింహులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నూతన అధ్యక్షుడు లొంక నరసింహులుకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేయాలని సూచించారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. నూతన పార్టీ కార్యాలయం అందుబాటులోకి రావడంతో కార్యకర్తలకు, నాయకులకు పార్టీ కార్యక్రమాలు నిర్వహించేందుకు సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




