Tandur: 1,100 మంది లబ్ధిదారులకు పింఛన్ పత్రాలు అందజేత

Tandur: తాండూరు మున్సిపల్ కార్యాలయంలో 1,100 మంది లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ పత్రాలను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఘనంగా పంపిణీ చేశారు.

Srikanth Reddy, Tandur
Published on: 16 Nov 2026 6:28 PM IST
Tandur
X

Tandur: 1,100 మంది లబ్ధిదారులకు పింఛన్ పత్రాలు అందజేత

తాండూరు: తాండూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో సుమారు 1100 (పదకొండు వందల ) మంది లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చేయూత పెన్షన్ పత్రాలను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ....

పెన్షన్ అనేది కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాకుండా వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, పేదలకు ఆత్మగౌరవంతో జీవించేందుకు కొండంత భరోసా అని పేర్కొన్నారు. ఈ నెల 19న ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు, అదే రోజు అర్హులైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ కానున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎన్నికల హామీలను దశలవారీగా అమలు చేస్తూ, నియోజకవర్గంలో సుమారు 5 వేల మందికి పెన్షన్లు అందిస్తోందన్నారు. పెన్షన్ల మంజూరులో అవినీతి, రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా పారదర్శకంగా అర్హులను ఎంపిక చేశామని, ఇంకా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

తాండూరు పట్టణంలో కాగ్నా నది నుంచి తాగునీటి సరఫరా, మాస్టర్ ప్లాన్, చిలుక వాగు, గొల్ల చెరువు అభివృద్ధితో పాటు డ్రైనేజీలు, సీసీ రోడ్లు, ఐమాక్స్ లైట్ల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. పేదల సంక్షేమం, పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur