Tandur: పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి: పైలెట్ రోహిత్ రెడ్డి!

Tandur: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తాండూరులో వైద్యులతో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమావేశమై ఓటరు నమోదుపై చర్చించారు.

Srikanth Reddy, Tandur
Published on: 27 Oct 2026 10:33 PM IST
Tandur
X

Tandur: పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి: పైలెట్ రోహిత్ రెడ్డి!

తాండూర్: హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తాండూర్ బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డా.జయప్రసాద్‌తో పాటు పలువురు డాక్టర్లతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమంపై వారితో చర్చించారు. పట్టభద్రుల సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలు కీలకమని అని అన్నారు. అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్యంలో తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పైలెట్ రోహిత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur