Tandur: పాత తాండూరులో గణనాథునికి కౌన్సిలర్ నారా శ్రీలత ప్రత్యేక పూజలు
Tandur: పాత తాండూరు తెలుగు గడ్డలో జరిగిన 5వ రోజు వినాయక నవరాత్రి మహోత్సవాల్లో 16వ వార్డు కౌన్సిలర్ నారా శ్రీలత శ్రీకాంత్ పాల్గొని పూజలు చేశారు.
Tandur: పాత తాండూరులో గణనాథునికి కౌన్సిలర్ నారా శ్రీలత ప్రత్యేక పూజలు
Tandur: పాత తాండూర్‌లోని తెలుగు గడ్డలో శ్రీ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 5వ రోజు శ్రీ వినాయకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో 16వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి నారా శ్రీలత శ్రీకాంత్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పూజా కార్యక్రమంలో భక్తులు, కమిటీ సభ్యులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు శాలువాతో 16వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి నారా శ్రీలత శ్రీకాంత్ ఘనంగా సన్మానించారు.
భక్తి, ఐక్యత, సంప్రదాయాల సమ్మేళనంగా తెలుగు గడ్డలో వినాయక ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
ఈ కార్యక్రమంలో కమిటీ పెద్దలు శివ, రాజు, భీమ్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




