Hyderabad: ‘అయ్యప్ప మా అయ్యప్ప’ భక్తి గీతాన్ని విడుదల చేసిన సాయి కిరణ్!

Hyderabad: కార్తీక మాసం సందర్భంగా రూపొందించిన ‘అయ్యప్ప మా అయ్యప్ప’ భక్తి గీతాన్ని బీఆర్ఎస్ యువ నేత తలసాని సాయి కిరణ్ యాదవ్ బుధవారం జూబ్లీహిల్స్‌లో విడుదల చేశారు.

RAJESH,	WEST ZONE
Published on: 25 Nov 2026 5:13 PM IST
Hyderabad
X

Hyderabad: ‘అయ్యప్ప మా అయ్యప్ప’ భక్తి గీతాన్ని విడుదల చేసిన సాయి కిరణ్!

Hyderabad: కార్తీక మాసంలో అయ్యప్ప మాలాధారణ చేసిన స్వాముల కోసం భక్తిభావంతో పాడుకునే అయ్యప్ప మా అయ్యప్ప భ‌క్తి గీతాన్ని విడుద‌ల చేయ‌డం సంతోషంగా ఉంద‌ని బీఆర్ఎస్ యువ నేత త‌ల‌సాని సాయి కిర‌ణ్ యాద‌వ్ అన్నారు .హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ లోని త‌న నివాసంలో ప‌ర్ణ‌శాల వార్త సంస్థ ఆధ్వ‌ర్యంలో రూపొందించిన భ‌క్తిగీతంను నిర్మాత స‌తీష్ రెడ్డి, ర‌చ‌యిత‌ నందిని టీం స‌భ్యుల‌తో క‌లిసి ఆయ‌న ఆవిష్క‌రించారు.

అయ్యప్ప స్వామి జీవిత చ‌రిత్ర‌ను పాట రూపంలో అందించిన యువ ర‌చ‌యిత నందినిని అభినందించారు .బీఆర్ఎస్ యువ నేత సాయి కిర‌ణ్ చేతుల మీదుగా ఈ భ‌క్తిగీతాన్ని విడుద‌ల చేయ‌డం ప‌ట్ల ఆమె ఆనందం వ్య‌క్తం చేశారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE