Talakondapally: చుక్కాపూర్‌లో ఘనంగా యాదవుల సదర్ వేడుకలు
Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చుక్కాపూర్‌లో వైభవంగా యాదవుల సదర్ వేడుకలు. హాజరైన మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, పాపిశెట్టి రాము.
Talakondapally: చుక్కాపూర్‌లో ఘనంగా యాదవుల సదర్ వేడుకలు
తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామంలో యాదవుల ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా సదర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ప్రముఖ సంఘ సేవకులు, ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు పాపిశెట్టి రాము, రామన్న మిత్రమండలి సభ్యుడు శ్రీను నాయక్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, నాయకులు, యువకులు, యాదవ సంఘం సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంప్రదాయ కార్యక్రమాలు, ఉత్సాహభరిత వాతావరణం మధ్య సదర్ వేడుకలను ఆనందోత్సాహాలతో నిర్వహించారు. వేడుకల్లో గ్రామస్తులు పాల్గొన్నారు




