Talakondapally: చీపునుంతల గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

Talakondapally: తలకొండపల్లి మండలం చీపునుంతల గ్రామంలో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. పాల్గొన్న సర్పంచ్, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 21 Sept 2026 7:04 PM IST
Talakondapally
X

Talakondapally: చీపునుంతల గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా తలకొండపల్లి మండలం చీపునుంతల గ్రామంలో సోమవారం స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్‌ శ్రీమతి గుజ్జుల లక్ష్మమ్మ ఆశన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా స్మార్ట్‌ రేషన్‌ కార్డుల ప్రాముఖ్యత, వాటి ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి కుటుంబం ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్‌ గుమ్మడి రాజు, వార్డు సభ్యులు ఆల్వాల్‌ రెడ్డి, మేడమోని రాజు, గుమ్మడి శారద, చినుకుంట్ల అంజమ్మ, గ్రామ కార్యదర్శి రాములు, తలకొండపల్లి మండల కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ అధ్యక్షులు, మాజీ ఉపసర్పంచ్‌ చెన్నకేశవులు, మాజీ సర్పంచ్‌ రఘుపతి, గ్రామ పెద్దలు, మహిళలు, ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు, కల్వకుర్తి శాసనసభ్యులు శ్రీ కసిరెడ్డి నారాయణరెడ్డి అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY